ఈ ఏడాది ఇప్పటివరకు టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు


Tollywood 2018 hit movies list

2018 లో ప్రారంభం అస్సలు బాగోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ కాగా నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా యావరేజ్ గా మాత్రమే నిలిచింది . అయితే అనుష్క నటించిన భాగమతి హిట్ అయ్యింది . ఇక ఆ తర్వాత టాలీవుడ్ కి సాలిడ్ హిట్ పడింది రంగస్థలం చిత్రం తోనే అది కూడా వేసవిలో . రంగస్థలం ప్రభంజనం తర్వాత మహానటి సంచలన విజయం సాధించింది . అలాగే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది . వేసవిలో వచ్చిన ఈ మూడు చిత్రాలు సాలిడ్ హిట్స్ కొట్టాయి . ఇక చిన్న చిత్రాలుగా వచ్చిన ఆర్ ఎక్స్ 100 వసూళ్ల సునామి సృష్టించింది . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి యువతరం బ్రహ్మరధం పట్టారు . అలాగే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం కూడా అండర్ డాగ్ గా వచ్చి వంద కోట్ల క్లబ్ లో చేరడం సంచలనమే అయ్యింది .

సుధీర్ బాబు నటించిన సమ్మోహనం , నన్ను దోచుకుందువటే , గూఢచారి , ఛలో , తొలిప్రేమ చిత్రాలు హిట్ కాగా ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ సాలిడ్ హిట్ కాలేకపోయింది .అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయ్యింది . ఈ ఏడాదిలో ఇప్పటివరకు పది నెలల కాలంలో 100 కు పైగా సినిమాలు విడుదల అయ్యాయి . అయితే వాటిలో 10 చిత్రాలు మాత్రమే హిట్స్ మిగతావన్నీ యావరేజ్ లు ప్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి .

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలు :
1) రంగస్థలం
2) మహానటి
3) గీత గోవిందం
4) ఆర్ ఎక్స్ 100
5) భరత్ అనే నేను
హిట్ చిత్రాలు :
1) ఛలో
2) భాగమతి
3) తొలిప్రేమ
4) గూఢచారి
5) సమ్మోహనం

English Title: Tollywood 2018 hit movies list