జనవరిలో ఒక్కటే హిట్


Tollywood 2019 janaury review

2019 జనవరి నెలలో ఒక్కటంటే ఒక్కటే హిట్ అయ్యింది . జనవరిలో 15 సినిమాల వరకు రిలీజ్ కాగా అందులో ఎఫ్ 2 మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది మిగతా సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ లు , ప్లాప్ లు . సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది . అయితే ఆ సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అస్సలు రాలేదు దాంతో 50 కోట్ల నష్టం వాటిల్లింది బయ్యర్లకు . ఇక దాని తర్వాత జనవరి 10 రజనీకాంత్ నటించిన పేట రిలీజ్ అయ్యింది ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు .

జనవరి 11న రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం రిలీజ్ అయ్యింది . ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది . ఇక జనవరి 12న పెద్దగా అంచనాలు లేని చిత్రం ఎఫ్ 2 రిలీజ్ అయ్యింది . మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఇక మధ్యలో కొన్ని చిత్రాలు వచ్చాయి కానీ అవేవి వర్కౌట్ కాలేదు ఇక అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను జనవరి 25 న రిలీజ్ అయ్యింది . ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . మొత్తానికి జనవరిలో ఒక్కటే ఎఫ్ 2 విజయం సాధించింది . ఇక ఇప్పుడేమో ఫిబ్రవరి మొదలయ్యింది . ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఒకటి కూడా హిట్ అయ్యేలా లేదు .

English Title: Tollywood 2019 january review