నటుడు వినోద్ మృతి


tollywood actor vinod deadటాలీవుడ్ నటుడు వినోద్ ఈరోజు తెల్లవారుఝామున 3 గంటలకు మృతి చెందాడు . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన వినోద్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు . కాగా ఈరోజు తెల్లవారుఝామున మూడు గంటలకు వినోద్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు . వినోద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుంటూరు జిల్లా తెనాలి . కీర్తి కాంత కనకం అనే సినిమాతో 1980 లో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసాడు వినోద్ .

నల్లత్రాచు , లారీ డ్రైవర్ , చంటి తదితర చిత్రాల్లో వినోద్ నటనకు ప్రశంసలు దక్కాయి . ఎక్కువగా విలన్ గా నటించాడు దాదాపు మూడు వందల చిత్రాల్లో నటించిన వినోద్ తమిళ , హిందీ బాషలలో కూడా నటించాడు అలాగే పలు సీరియల్ లలో నటిస్తున్నాడు కూడా . వినోద్ కు భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు . వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వర్ రావు కాగా స్క్రీన్ నేమ్ వినోద్ గా మార్చుకున్నాడు . వినోద్ మృతి పట్ల మా అసోసియేషన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపాన్నీ వ్యక్తం చేసారు .

English Title: tollywood actor vinod dead