జూలై లో హిట్స్ లేక విలవిలా


tollywood box office review month of julyజూలై నెల నిన్నటితో అయిపొయింది కాగా ఆ నెలలో 13 సినిమాలకు పైగా విడుదల కాగా అందులో ఒక్క ” ఆర్ ఎక్స్ 100 ” చిత్రం మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది ఇక మిగతా సినిమాలన్ని ప్లాప్ అయ్యాయి . ప్లాప్ అయిన వాటిలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ” చినబాబు ” , సాయిధరమ్ తేజ్ నటించిన ” తేజ్ ఐ లవ్ యు ”, మంచు లక్ష్మి ” వైఫ్ ఆఫ్ రామ్ ”, గోపీచంద్ ” పంతం ” , రాజ్ తరుణ్ ” లవర్ ”, నిహారిక ” హ్యాపీ వెడ్డింగ్ ”, త్రిష మోహిని చిత్రాలు ఉన్నాయి అంతేకాదు వీటితో పాటుగా మరికొన్ని చిత్రాలు విడుదల అయ్యాయి అయితే అవేవీ ప్రేక్షకులకు అంతగా తెలిసిన సినిమాలు కాకపోవడంతో డిజాస్టర్ అయ్యాయి .

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది కాకపోతే బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో కొంతమేర కలెక్షన్లు రాబడుతోంది . దాదాపు నలభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం చిత్రానికి ఇంకా పది కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . అంటే ఇంకా పెద్ద మొత్తంలోనే డబ్బులు రావాలి మరి ఆ స్థాయి వసూళ్ల ని రాబట్టే సత్తా మాత్రం లేదు ఈ సినిమాకు కాబట్టి ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరినట్లే ! ఇక ఆర్ ఎక్స్ 100 చిత్రానికి వస్తే ……. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి దాంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు భారీ లాభాలను చూసి . జూలై నెలలో ఒక్కటంటే ఒక్కటే హిట్టు అది కూడా ” ఆర్ ఎక్స్ 100 ” చిత్రం మాత్రమే !

English Title: tollywood box office review month of july