మా నిర్ణయం తర్వాత శ్రీరెడ్డి ఎమ్ చేసిందో తెలుసా


srireddy dance video goes viralశ్రీరెడ్డి లీక్స్ తో తెలుగునాట ప్రభంజనం సృష్టించింది . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం కోసం అప్లికేషన్ పెట్టుకుంది శ్రీరెడ్డి అయితే ఆమెకు సభ్యత్వాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా శ్రీరెడ్డి తో నటించిన వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు చేస్తామని చెప్పి తేనెతుట్టె ని కదిపారు దాంతో శ్రీరెడ్డి విశ్వరూపం అంటే ఏమిటో చూపించింది కట్ చేస్తే పదిరోజులుగా టాలీవుడ్ ప్రముఖులకు నిద్ర లేకుండా చేసింది .

అయితే వివాదం ముదిరి ప్రముఖులకు నిద్ర లేకుండా చేయడంతో ఎట్టకేలకు మా స్పందించి శ్రీరెడ్డి పై విధించిన బ్యాన్ ని ఎత్తేయడమే కాకుండా ఆమెకు మా సహకారం అందిస్తుందని ప్రకటించడంతో శ్రీరెడ్డి పరవశించి పోయింది . మా నిర్ణయం తర్వాత శ్రీరెడ్డి ఆనందానికి అంతేలేకుండా పోయింది దాంతో విచ్చలవిడిగా డ్యాన్స్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది . అంతేకాదు ఆ సమయంలో వీడియో తీసింది ఇంకేముంది ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .