ఎమ్మెస్ ధోని రిటైర్మెంట్ పై తెలుగు సెలబ్రిటీల ట్వీట్స్


ఎమ్మెస్ ధోని రిటైర్మెంట్ పై తెలుగు సెలబ్రిటీల ట్వీట్స్
ఎమ్మెస్ ధోని రిటైర్మెంట్ పై తెలుగు సెలబ్రిటీల ట్వీట్స్

టీమిండియా వికెట్ కీపర్, 2007 టి20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 రథసారథి మహేంద్ర సింగ్ ధోని లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే టెస్టుల్లో రిటైర్ అయిన ధోని, ఇప్పుడు మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుండే దూరమయ్యాడు. నిన్న సడెన్ గా ఇన్స్టాగ్రామ్ లో తన జ్ఞాపకాలను వీడియోగా చేసి ఒక ఫీల్ గుడ్ సాంగ్ ను జతచేసి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు ఎమ్మెస్ ధోని. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించడంలో ధోని పాత్ర కీలకమన్నది ఎవరూ కాదనలేని నిజం.

సోషల్ మీడియాలో ధోని రిటైర్మెంట్ గురించిన వార్త సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరూ ధోని భారత్ కు ఎంతటి కీలక ఆటగాడో, ఆయన చేసిన సేవలు వంటివి గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నారు. అటు క్రీడాభిమానులే కాక సినీ సెలబ్రిటీస్ కూడా ధోనికు వీడ్కోలు పలుకుతున్నారు.

తెలుగు సెలబ్రిటీస్ ధోని రిటైర్మెంట్ పై ట్వీట్స్ వేస్తుండడం విశేషం. దర్శక దీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, రవితేజ మొదలగు సెలబ్రిటీలు ఎమ్మెస్ ధోనికి హ్యాపీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఎమ్మెస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినా కానీ ఐపీఎల్ లో ఆడతాడు.