14 వేల మందిని దృష్టిలో పెట్టుకోండి – చిరంజీవి‌


14 వేల మందిని దృష్టిలో పెట్టుకోండి - చిరంజీవి‌
14 వేల మందిని దృష్టిలో పెట్టుకోండి – చిరంజీవి‌

క‌రోనా కార‌ణంగా తెలుగు చిల‌న చిత్ర భారీ న‌ష్టాల్ని చ‌విచూస్తోంది. షూటింగ్‌లు ఆగిపోవ‌డం, థియేట‌ర్లు మూసివేయ‌డంతో రిలీజ్ కావాల్సిన సినిమాల ప‌రిస్థితి ఇబ్బంది క‌రంగా మారింది. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలి? ప‌్ర‌భుత్వం ఈ విష‌యంలో ఎలాంటి ఆలోచ‌న‌తో వుంది? అనే విష‌యాలలో స్ప‌ష్ట‌త కోసం తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన పుల‌వురు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో గురువారం ఉద‌యం ప్ర‌త్యేకంగా సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్‌తో స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఆస‌క్త‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ` లాక్‌డౌన్ ముగుస్తున్న సంద‌ర్భంగ‌లో ఆయా రంగాల ప్ర‌భుత్వం ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చింది. మ‌రి సినిమా రంగం ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న ప్ర‌తీ ఒక్క‌రిలోనూ మొద‌లైంది. షూటింగ్‌లు మొద‌లుపెట్ట‌డానికి మ‌న‌కు ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేదు. కానీ ఇలాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో క‌రోనా వ్యాప్తికి మ‌నం కార‌ణం కాకూడ‌ద‌నే చిన్ని గిల్టీతో ప్ర‌భుత్వ స‌హ‌కారంతో వారి నిబంధ‌న‌ల‌కు లోబ‌డి మ‌న షూటింగ్స్ అత్యంత జాగ్ర‌త్త‌గా చేసుకుందాం` అని పేర్కొన్నారు.

విడుద‌ల‌కు సిద్ధంగా వున్న సినిమాల కోస‌మో లేక షూటింగ్ మ‌ధ్య‌లో వున్న సినిమాల నిర్మాత‌ల కోస‌మో చేస‌క్తున్న విన‌తి కాదు ఇది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని దీని స్థితిలో వున్న 14 వేల మంది రోజు వారీ సినీ కార్మికులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న విన్న‌పం ఇది. ఈ 14 వేల మంది ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగారికి, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగారికి విన్న‌విన్నానా` అని చిరంజీవి చెప్పిన‌ట్టు తెలిసింది.

దీనిపై మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ ` అంద‌రి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ‌తామ‌ని, షూటింగ్ వ‌ద్ద తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చించాం అన్నారు. సినిమాల షూటింగ్‌ల‌పై ప్రాధాన్యాలు గుర్తించాలని, థియేట‌ర్లు తెరిచిన వెంట‌నే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా?  లేదా అనేది స‌మ‌స్య‌గా వుంద‌ని, ఒక‌టి రెండు రోజుల్లో అన్ని విష‌యాల‌పై నిర్ణ‌యాలు జ‌రుగుతాయ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. లాక్‌డౌన్ లోపు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ మాక్ షూటింగ్‌లు చేస్తామ‌ని, ఇందు కోసం ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని సినీ పెద్ద‌లు అంటున్నాక‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు.  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు ఎలాంటి అడ్డంకులు వుండ‌వు.  షూటింగ్‌ల‌కు అనుమ‌తుల‌పై చ‌ర్చిస్తున్నాం. సీఎంతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం` అన్నారు.