కేరళ వరద బాధితుల కోసం నడుం కట్టిన టాలీవుడ్


tollywood donate big for kerala floods

కేరళలో ప్రకృతి భీభత్సంతో ప్రజలు అల్లల్లాడి పోతున్నారు , ఇప్పటికే వేలాదిమంది నిరాశ్రయులు కాగా 300 కు పైగా మృత్యువాత పడ్డారు , ఇంకా వేలాదిమంది తినడానికి తిండి లేక ఉండటానికి గూడు లేక ఇబ్బందులు పడుతున్నారు దాంతో కేరళ

ప్రజలను ఆదుకోవడానికి టాలీవుడ్ నడుం బిగించింది . టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు భారీ ఎత్తున స్పందిస్తూ విరాళాలు ప్రకటిస్తున్నారు కొంతమంది నేరుగా ఆన్ లైన్ లో పంపిస్తున్నారు . చిరంజీవి , నాగార్జున , మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , చరణ్ , కళ్యాణ్ రామ్ , ప్రభాస్ , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలా పలువురు స్పందించి భారీ విరాళాలు అందిస్తున్నారు .

టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు ఇలా ఉన్నాయి ఉన్నాయి .

చిరంజీవి – 25 లక్షలు
నాగార్జున అండ్ అమల – 28 లక్షలు
మహేష్ బాబు – 25 లక్షలు
ఎన్టీఆర్ – 25 లక్షలు
ప్రభాస్ – 25 లక్షలు
అల్లు అర్జున్ – 25 లక్షలు
రామ్ చరణ్ – 25 లక్షలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ – 10 లక్షలు
నందమూరి కళ్యాణ్ రామ్ – 10లక్షలు
అంజనాదేవి – 1లక్ష
ఉపాసన – పది లక్షల విలువైన మందులు
విజయ్ దేవరకొండ – 5 లక్షలు
కొరటాల శివ – 3 లక్షలు
రామ్ – 5 లక్షలు
అనుపమా పరమేశ్వరన్ – లక్ష
రోహిణి – 2 లక్షలు
ఇవి కాకుండా ఇంకా మరికొంతమంది సినీ ప్రముఖులు స్పందించారు కూడా .

English Title: tollywood donate big for kerala floods