వచ్చే వారం నుండి బిజీబిజీగా టాలీవుడ్

వచ్చే వారం నుండి బిజీబిజీగా టాలీవుడ్
వచ్చే వారం నుండి బిజీబిజీగా టాలీవుడ్

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గడంతో టాలీవుడ్ తిరిగి షూట్ మోడ్ లోకి వెళ్లబోతోంది. ఇప్పటికే నితిన్ మేస్ట్రో చిత్ర ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టేశాడు. వచ్చే వారం నుండి చాలా చిత్రాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. అందులో ప్రముఖంగా నాగ చైతన్య, రవితేజ, సమంత, నిఖిల్ చిత్రాలు ఉన్నాయి.

మాస్ మహారాజా రవితేజ క్రాక్ తర్వాత చేస్తోన్న ఖిలాడీ షూటింగ్ లాస్ట్ స్టేజెస్ లో ఉంది. జూన్ 21 నుండి ఖిలాడీ ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకుడు. నాగ చైతన్య నటిస్తోన్న థాంక్యూ చిత్ర షూటింగ్ కూడా అదే రోజున తిరిగి మొదలుకానుంది. ఇటలీలో ఇప్పటికే మెజారిటీ పోర్షన్ ను పూర్తి చేసారు.

సమంత చేస్తోన్న శాకుంతలం జూన్ 24 నుండి రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. జెట్ స్పీడ్ లో ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసాడు గుణశేఖర్. ఇక నిఖిల్ 18 పేజెస్ షూటింగ్ కూడా వచ్చే వారమే ట్రాక్ ఎక్కుతుంది.