రాజమౌళి వల్లే పాన్ ఇండియా సాధ్యపడుతుందా?


రాజమౌళి వల్లే పాన్ ఇండియా సాధ్యపడుతుందా?
రాజమౌళి వల్లే పాన్ ఇండియా సాధ్యపడుతుందా?

తెలుగు సినిమాలకు రెండు రాష్ట్రాల్లో తప్పించి బయట పెద్ద మార్కెట్ లేదు. మహా అయితే కర్ణాటకలో మార్కెట్ ఉంది కానీ అది దాటితే తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడమే కష్టం. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇదంతా బాహుబలి కాదు కాదు రాజమౌళి చేసిన మ్యాజిక్.

రాజమౌళి బాహుబలి తీయకపోయి ఉంటే ఈరోజు సైరా చేసే వాడ్ని కాదు అని చిరంజీవి స్వయంగా స్టేజ్ మీద చెప్పాడంటే అర్ధం చేసుకోవచ్చు. పాన్ ఇండియా సినిమా తీయడమంటే మాములు వ్యవహారం కాదు. లాభాల్లో ఎలా వస్తాయో అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథ రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బాహుబలి లాంటి మ్యాజిక్స్ సాధ్యపడతాయి.

బాహుబలి వచ్చిన తర్వాత చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ ను టార్గెట్ చేసుకుని విడుదలయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సైరాతో సహా. కానీ ఏ చిత్రం కూడా బాహుబలి రాబట్టిన అమౌంట్ లో మూడవ వంతు కూడా వసూలు చేయలేదు. దీనికి కారణాలు అనేకం. అయితే మరో పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ నుండి వచ్చి హిట్ కొట్టాలంటే అది రాజమౌళి వల్లే సాధ్యపడుతుంది అంటున్నారు. మరి రాజమౌళి బాహుబలి మ్యాజిక్ ను రిపీట్ చేయగలడా?