ఫస్ట్ వీక్ లో హయ్యెస్ట్ షేర్ సాధించిన టాప్ టెన్ చిత్రాలు


Tollywood first week top ten movies list

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 77 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి టాలీవుడ్ లో హయ్యెస్ట్ షేర్ సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో నెంబర్ 5 గా నిలిచింది . 77. 31 కోట్ల షేర్ సాధించి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వ చిత్రంతో సమానంగా నిలిచి చిరుతో పొతే పడుతున్నాడు ఎన్టీఆర్ . మొదటి మూడు స్థానాల్లో బాహుబలి 2 , బాహుబలి , రంగస్థలం చిత్రాలు నిలిచాయి . దసరా సెలవులు ఎన్టీఆర్ కు అండగా నిలిచాయి దాంతో చాలాచోట్ల నాన్ బాహుబలి రికార్డులు అందుకున్నాడు ఎన్టీఆర్ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత జోష్ ఇప్పుడు తగ్గింది అయితే ఇంకా దసరా సెలవులు ఉన్నందున మరిన్ని మంచి వసూళ్లు సాధించవచ్చు .

ఇక టాలీవుడ్ లో మొదటి వారంలో ఎక్కువ షేర్ వసూల్ చేసిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి . టాలీవుడ్ లో ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ షేర్ సాధించిన టాప్ టెన్ చిత్రాల వసూళ్లు ఇలా ఉన్నాయి .

1 ) బాహుబలి 2 – 429.52 కోట్ల షేర్
2 ) బాహుబలి – 151 కోట్లు
3 ) రంగస్థలం – 79.89 కోట్లు
4 ) ఖైదీ నెంబర్ 150 – 77. 31 కోట్లు
5 ) అరవింద సమేత – 77.31 కోట్లు
6 ) భరత్ అనే నేను – 71. 85 కోట్లు
7 ) జనతా గ్యారేజ్ – 62.5 కోట్లు
8 ) జై లవకుశ – 62 కోట్లు
9 ) దువ్వాడ జగన్నాధం – 61.05 కోట్లు
10 ) శ్రీమంతుడు – 57. 73 కోట్లు

English Title: Tollywood first week top ten movies list