తెలుగు భామలు.. గ్లామరసాన్ని చిలుకుతున్నారు


తెలుగు భామలు.. గ్లామరసాన్ని చిలుకుతున్నారు
తెలుగు భామలు.. గ్లామరసాన్ని చిలుకుతున్నారు

పొరుగింటి పుల్లకూర రుచి.. అని తెలుగులో ఒక సామెత ఉంది. సినీ ఇండస్ట్రీలో ఐతే ఈ మాట నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎందుకంటే మనం తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయడానికి అంతగా ముందుకు రాము. కానీ ముంబై నుండి కనీసం ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలో తెలియని, భాష రాని హీరోయిన్ ను తెచ్చుకుని వారికి కోట్లకు కోట్లు ధారపోస్తాం. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దానికి పైగా సినిమాలు చేస్తూ “అందరికీ నమస్కారం” తప్ప మరో తెలుగు ముక్క రాని హీరోయిన్లు ఇంకా టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అదే భాష వచ్చిన మన తెలుగు భామలు.. అందంలో వారికి ఏ మాత్రం తీసిపోరు, నటనలో వారికంటే మెరుగ్గానే ఉంటారు, కానీ వారిని మనవాళ్ళు విస్మరిస్తూనే ఉంటారు.

ప్రస్తుత ఉదాహరణకు తీసుకుంటే అంజలి, ఈషా రెబ్బా ఈ కోవకే చెందుతారు. గీతాంజలి, బలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో అంజలి తెలుగు సినిమాల్లో తనకంటూ స్థానం సంపాదించుకోవాలని తాపత్రయపడింది. అయితే ఆ మధ్య బొద్దుగా తయారైందంటూ కామెంట్లు వినపడడంతో పూర్తిగా సైడ్ ట్రాక్ కు వెళ్లి నాజూకు అందాలతో అబ్బాయిల హృదయాలకు గేలం వేస్తోంది. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈ భామను ఇకనైనా తెలుగు స్టార్ హీరోలు, దర్శకులు పట్టించుకుంటారా?

అన్నట్టు ఈ అమ్మడు గ్లామర్ చిందించడానికి ఏ మాత్రం సంకోచించట్లేదు. ఈ మధ్య అంజలి ఫోటోషూట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తన నాజూకుతనం హైలైట్ అయ్యేలా అంజలి ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. పై ఫోటోనే తీసుకుంటే అంజలి, బొమ్మ పక్కన అచ్చంగా అదే ఫోజులో నిలబడిన భంగిమ, యువకులకు గిలిగింతలు పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక మరో భామ ఈషా రెబ్బా.. ఈమె గురించి ఏమని చెప్పాలి. అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈషా.. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలతో తొణికిసలాడుతుంది. అయినా ఏం లాభం, ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. ఇతర భాషల నుండి ఆఫర్లు వస్తున్నా తెలుగు సినిమాలో స్టార్ గా ఎదగాలని తాపత్రయపడుతున్న ఈషా.. ఇతర భాషల్లో సెలెక్టివ్ గా ఉంటోంది. నటనలో ఈమెకు పేరు పెట్టలేం కానీ అది నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. రీసెంట్ గా అరవింద సమేత చిత్రంలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను ఇచ్చాడు త్రివిక్రమ్. గ్లామర్ పండించడంలో ఎవరికీ తక్కువ కాదు కానీ దానికి కూడా అవకాశాలిచ్చేవారు ఏరి? అందుకే ఈ అమ్మడు ఫోటోషూట్ మార్గాన్ని ఎంచుకుంది. ఈషా రెబ్బా సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే దిమ్మతిరగడం ఖాయం.

ఇదే భామ ఏ ముంబై నుండో దిగుమతై ఉంటే కచ్చితంగా ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసేసేవారు. పై ఫోటోనే తీసుకోండి. ట్రాన్స్పరెంట్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈషా రెబ్బా దెబ్బకు అబ్బాయిలంతా అబ్బా అని గుండెల మీద చేయి వేసుకోకుండా ఉండలేరు. గ్లామర్ కంటెంట్ తో రోజురోజుకీ రెచ్చిపోతున్న ఈ భామకు సరైన అవకాశాలిచ్చి ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేస్తారో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

🖤🖤🖤 . . 📸 @chinthuu_klicks 👗 @wisperkadiko . #eesharebba #yourseesha

A post shared by 𝐄𝐄𝐒𝐇𝐀 𝐑𝐄𝐁𝐁𝐀 🌟 (@yourseesha) on

 

View this post on Instagram

 

🖤🖤 . . . . . 👗 @wisperkadiko 📸 @chinthuu_klicks . . #eesharebba #yourseesha

A post shared by 𝐄𝐄𝐒𝐇𝐀 𝐑𝐄𝐁𝐁𝐀 🌟 (@yourseesha) on

 

View this post on Instagram

 

🖤 . . 📸 @chinthuu_klicks 👗 @wisperkadiko . . #eesharebba #yourseesha

A post shared by 𝐄𝐄𝐒𝐇𝐀 𝐑𝐄𝐁𝐁𝐀 🌟 (@yourseesha) on

Credit: Instagram