“మెహర్” అన్నను మళ్ళీ ఏసుకుంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్


“మెహర్” అన్నను మళ్ళీ ఏసుకుంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్
“మెహర్” అన్నను మళ్ళీ ఏసుకుంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్

ఒక జనరేషన్ తాలూకు మనుషులు అందరికీ కొన్ని సినిమాలు బాగా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రేక్షకుల అభిమానుల అభిరుచులూ,అభిప్రాయాలు,ఇష్టాలు మారిపోతూ ఉంటాయి అని విశ్లేషకులు అంచనా. ప్రస్తుతం సినిమా అప్డేట్స్ ఏమీ లేని ఈ తరుణంలో.. సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా గతంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మరియు డిజాస్టర్ అయిన తమ అభిమాన హీరోల సినిమాలను తలచుకొని.. హిట్ ఇచ్చిన వాళ్ళను ప్రేమిస్తూనే.. ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ లను మాత్రం మళ్లీ ఫ్రెష్ బూతులతో ఆడుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమాలు షూటింగ్ లు, రిలీజ్ లు అన్ని ఆగిపోవడంతో భారీ స్థాయిలో ఎప్పుడూ హల్చల్ చేసే సినిమా హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు కాసేపు పాత సినిమాలు గురించి మాట్లాడుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు.అందరూ చాలా ఈజీగా టైం మిషన్ ఎక్కి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి తమ అభిమాన హీరోల సినిమాల గురించి కామెంట్లు చేసుకుంటున్నారు.

 ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా విడుదలై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల పవర్ స్టార్ మళ్లీ సినిమాల లో రీ ఎంట్రీ ఇచ్చిన ఊపుతో  ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ “జల్సా” సినిమా వైబ్స్ ను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ సినిమా స్క్రీన్ ప్లే, ముఖ్యంగా త్రివిక్రమ్ గారి డైలాగులు, పవన్ కళ్యాణ్ నటన, ఆ సినిమా ఫిలాసఫీ గురించి పోస్టులు పోటెత్తుతున్నాయి. ఇక బాహుబలి ప్రభాస్ అభిమానులు కూడా తమ డార్లింగ్ నటించిన “బిల్లా” సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

 ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన డిజాస్టర్ సినిమా “శక్తి” విడుదలై తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఫ్యాన్స్ మళ్లీ పాత ప్రస్టేషన్ గుర్తుతెచ్చుకొని ఆ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా వైజయంతి మూవీస్ బ్యానర్ లో కూడా అతి పెద్ద డిజాస్టర్ సినిమా “శక్తి.”

 ఇక ఈ లాక్ డౌన్ అయ్యేంతవరకూ సినిమా అభిమానుల మధ్య ముఖ్యంగా సినిమా హీరోల అభిమానుల మధ్య ఇలాంటి పంచాయతీలే జరుగుతాయని ఆశించవచ్చు.