మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రుగుతోంది?


మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రుగుతోంది?
మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రుగుతోంది?

జూబ్లీహిల్స్‌లోని ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మకు సంబంధించిన అత్య‌వ‌స స‌మావేశం ఈ రోజు ఉద‌యం మొద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్ర‌ఫీ మినిస్ర్ త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న‌ ఈ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టా‌ర్ హీరో నాగార్జున‌, స్టా‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, N. శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో నిర్మాత‌లు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ల‌క్ష‌లాది మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. కార్మికుల్ని ఆదుకోవ‌డం కోసం సీసీసీ పేరుతో కార్మికుల కోసం నిధిని ఏర్పాటు చేసిన చిరంజీవి ప్ర‌స్తుత ప‌రిస్థితితుల్ని చ‌క్క‌దిద్దేందుకు న‌డుంబిగించారు.

ఇందు కోసం సీనీ పెద్ద‌ల్ని ఏకం చేసి త‌న నివాసంలో రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. షూటింగ్‌ల అనుమ‌తులు, థియేట‌ర్ల రీ ఓపెన్‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది.