టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ


Tollywood naya super star vijay devarakonda గీత గోవిందం చిత్రంతో మ్యాజిక్ చేస్తున్న విజయ్ దేవరకొండ ని టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు సినీ అభిమానులు . కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన విజయ్ దేవరకొండ కు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం కాస్త పేరు తెచ్చింది అయితే పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీ ద్రుష్టి ని తనవైపుకు తిప్పుకున్నాడు కట్ చేస్తే అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు . ఆసినిమా సంచలన విజయం సాధించడంతో విజయ్ రేంజ్ మారిపోయింది ఇక ఇప్పుడేమో ఏకంగా గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసేసారు .

ఇక కొంతమంది అయితే టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అంటూ ప్రచారం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల తర్వాత అంతటి ఫాలోయింగ్ విజయ్ కు దక్కుతుందని అంటున్నారు . అయితే అనూహ్యంగా వచ్చిన ఇమేజ్ ని తన తదుపరి సినిమాలతో కాపాడుకుంటేనే స్టార్ స్టేటస్ ఉంటుంది తప్ప లేకపోతే అది పేక మేడలా కూలిపోతుంది కూడా . వచ్చిన స్టార్ డం తో సరైన సినిమాలు చేస్తే నిజంగానే విజయ్ దేవరకొండ కు తిరుగులేని ఇమేజ్ మరింత బలంగా అవుతుంది లేదంటే ఇబ్బంది తప్పదు . స్టార్ డం , స్టార్ స్టేటస్ లను పక్కన పెడితే గీత గోవిందం మాత్రం భారీ వసూళ్ల ని సాధిస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తోంది ఎందుకంటే అదంతా విజయ్ దేవరకొండ మేనియా .

English Title: tollywood naya super star vijay devarakonda