టాలీవుడ్ నయా విజయశాంతి – ఐశ్వర్యా రాజేష్

టాలీవుడ్ నయా విజయశాంతి – ఐశ్వర్యా రాజేష్
టాలీవుడ్ నయా విజయశాంతి – ఐశ్వర్యా రాజేష్

ప్రస్తుతం వచ్చే హీరోయిన్లతోపాటు, ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు సైతం అయితే ఫుల్ లెంత్ హీరోయిన్ పాత్రలు, లేదంటే ఐటమ్ సాంగ్స్ ఉండే పాత్రలు చేస్తున్నారు, తప్ప… నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం చాలా తక్కువ. అగ్ర హీరోయిన్ లు సైతం ఇప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్నారు.. కానీ ఒక కంఫర్ట్ లెవెల్ వదిలి బయటికి రావడం లేదు. చాలెంజింగ్ గా ఉండే పాత్రలు కూడా చేయడం లేదు. ప్రస్తుతం వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా అన్ని రకాల పాత్రలు చేస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న నటి ఐశ్వర్య రాజేష్.

అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఐశ్వర్య రాజేష్ తన తొలి సినిమా అయినా “కాక్క ముట్టయి” సినిమాలోనే ఇద్దరు బిడ్డలకు తల్లిగా నటించింది. అదేవిధంగా అందరూ హీరోయిన్ పాత్రలు తప్ప ఏమీ చేయని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్ గా క్యారెక్టర్లు చేస్తూ, మరోవైపు పెద్ద హీరోల పక్కన చెల్లెలుగా కూడా నటించింది. వాటిలో హీరో శివ కార్తికేయన్ కు చెల్లెలుగా “నమ్మ వీట్టు పిళ్ళై” అనే సినిమాలో నటించింది. ఇటీవల రిలీజ్ అయిన “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాలో కూడా శివ కార్తికేయన్ ఒక అతిధి పాత్రలో ఆమె తో కలిసి నటించారు.

ఆమె రీసెంట్ సినిమా ఆయన “వనం కొట్టట్టం” అనే సినిమాలో విక్రమ్ ప్రభు పక్కన చెల్లెలి పాత్రలో నటించింది. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో ఆమె సువర్ణ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించింది. “జిందగీ ఏమైనా కమ్మగా ఉందా మామా…!” అంటూ గ్రామీణ పేద కుటుంబం లోని ఒక భార్య పడే ఆవేదన ఆమె ట్రైలర్ లో పలికించిన తీరు అద్భుతం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తమిళ అగ్ర హీరో విజయ్ తర్వాతి సినిమా అయిన “పాండీరాజ్” అనే చిత్రంలో కూడా ఐశ్వర్య రాజేష్ ఆయనకు చెల్లెలు గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తను ధ్రువీకరిస్తూ ఇటీవలే ఐశ్వర్య రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాను దళపతి విజయ్ సరసన చెల్లెలుగా నటిస్తున్న మాట నిజమేనని, కానీ మంచి స్క్రిప్ట్ కుదిరితే త్వరలోనే ఆయన పక్కన హీరోయిన్ గా కూడా నటిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇక సౌత్ ఇండస్ట్రీ వర్గాలు మొత్తం ఐశ్వర్య రాజేష్ గట్స్ ఎంతో గొప్పవి అని మెచ్చుకుంటున్నారు.