వరుస సంఘటనలతో షాక్ అవుతున్న టాలీవుడ్


Tollywood shocked with accidents
Tollywood shocked with accidents

టాలీవుడ్ హీరోలకు వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో షాక్ అవుతోంది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ . వరుసగా నలుగురు హీరోలు గాయాలపాలవగా అందులో నాలుగు రోజుల్లో ముగ్గురు హీరోలు గాయాల పాలవ్వడం మరింత సంచలనంగా మారింది . మొదట నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటిస్తున్న సమయంలో స్వల్ప గాయానికి గురయ్యాడు . అది మర్చిపోయే లోపు హీరో వరుణ్ తేజ్ వాల్మీకి షూటింగ్ కి వెళ్తూ కారు ప్రమాదానికి గురయ్యాడు అయితే అదృష్టవశాత్తు కారు బెలూన్ లు తెరుచుకోవడంతో వరుణ్ సేఫ్ అయ్యాడు .

ఇక నాగశౌర్య యాక్షన్ సీన్స్ కోసం ట్రై చేసి కాలు విరగ్గొట్టుకున్నాడు వైజాగ్ లో , ఆ సంఘటన మరిచిపోకముందే సందీప్ కిషన్ నిన్న కర్నూల్ దగ్గర ప్రమాదానికి గురయ్యాడు అయితే ఎవరికీ కూడా పెద్ద ప్రమాదాలు కాకపోవడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది . నాని మళ్ళీ షూటింగ్ కి రెడీ అయ్యాడు , వరుణ్ తేజ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు …… నాగశౌర్య కు నెల లేదా రెండు నెలల విశ్రాంతి తప్పదు , సందీప్ కిషన్ మరో వారం రోజుల్లో కోలుకోనున్నాడు .