అభిమానులకి నిరాశ తప్పట్లేదు! వారేమో ఊరుకోవట్లేదు


అభిమానులకి నిరాశ తప్పట్లేదు! వారేమో ఊరుకోవట్లేదు
అభిమానులకి నిరాశ తప్పట్లేదు! వారేమో ఊరుకోవట్లేదు

నిన్న ”కొమరం భీం” జయంతి సందర్బంగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లో ‘జూ.ఎన్.టి.ఆర్‘ గారు కొమరం భీం గా నటిస్తున్నారు కాబట్టి ఆయన లుక్ ఉన్న పోస్టర్ ఒకటి బయటికి వస్తుందేమో అని అభిమానులు అదే పనిగా ఎదురుచూస్తూ ఉన్నారు. నిర్మాతలు, దర్శకుల మాధ్యమాల్లో పోస్ట్స్ వెతుకుతూ ఉన్నారు. ట్విట్టర్ లో కొమర భీం జయంతి సందర్భంగా పోస్ట్స్ వచ్చాయి కానీ జూ.ఎన్.టి.ఆర్ లుక్ బయటికి రాలేదు అని చాలా మంది అభిమానులు నిరాశ చెందారు.

మొన్న సాయంత్రం ‘అల్లు అర్జున్’ అభిమానులకి కూడా ఇలానే జరిగింది. 2020 సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’ నుండి రెండవ పాట ‘రాములో రాములా’ అనుకున్న సమయానికి విడుదల చేయలేదని నిర్మాతలని తెగ దూషించారు అల్లు అర్జున్ అభిమానులు. మొన్న సాయంత్రం విడుదల అవ్వాల్సిన పాట నిన్న సాయంత్రం విడుదల చేసారు. మొన్న, నిన్న అల్లు అర్జున్ – జూ.ఎన్.టి.ఆర్ అభిమానులకి జరిగినట్లే ఈ రోజు ఇంకొక హీరో అభిమానులకి జరిగింది.

ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ‘పాన్ ఇండియా’ హీరో ”ప్రభాస్” గారి పుట్టినరోజు. మిర్చి, బాహుబలి రెండు పార్టులు మరియు సాహో సినిమాలతో అల్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. తెలుగులోనే కాదు పలు బాషల హీరోల అభిమానులకి ప్రభాస్ బాగా నచ్చాడు. మరి అలాంటిది ఆయన పుట్టిన రోజు నాడు అభిమానులు పెద్ద కట్ ఔట్లు వేసి పాలాభిషేకాలు, పూల మాలలు వేసి హడావిడి చెయ్యాలంటే ఒక కొత్త సినిమా పోస్టర్ కావాలి. పాత సినిమాలోనివి పెట్టేసి చేస్తే చెయ్యొచ్చు కానీ కొత్త సినిమా పోస్టర్ విడుదల అయితే అది ఒక మధురానుభూతి గా నిలిచిపోయేది. కానీ నిర్మాతలు కొత్త పోస్టర్ విడుదల చేయలేదు.

ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమా ‘జాన్’ నుండి ఒక్క పోస్టర్ కూడా విడుదల అవ్వలేదు. జిల్ సినిమా దర్శకులు రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ గారిని కొత్త అవతారంలో చూపించబోతున్నారు అని అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న, ఈ రోజు సినిమా నుండి ఒక్క పోస్టర్ కూడా విడుదల అవ్వకపోవడంతో అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఒక పక్క ప్రభాస్ గారు లండన్ లో ‘బాహుబలి’ సినిమా యూనిట్ వారితో కలిసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లైవ్ ఆర్కెస్ట్రా పనిలో నిమగ్నమయి ఉన్నారు.

కనీసం ఎస్.ఎస్.రాజమౌళి గారు అయిన ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుతున్నారు అంటే అది లేదు. లండన్ లో ప్రభాస్ గారు అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి గారితో ఉన్నారు. వారి మాధ్యమాల్లో కూడా ప్రభాస్ పుట్టిన రోజు గురించి ఏదైనా పోస్ట్ పెడతారు అని ఎదురుచూసారు. అలాంటివి ఏమి లేకపోయేసరికి చాల నిరాశచెందారు ప్రభాస్ అభిమానులు. ఇక చేసేందేం లేక ‘సాహు’ సినిమాలోని కొన్ని పోస్టర్స్ ని కటౌట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాధ్యమాల్లో ”ప్రభాస్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని తెలుపుకున్నారు. నిర్మాతలు, దర్శకులు ఇలా చేయడం వలన అభిమానులకి కొంత కోపం తెప్పిస్తున్నారు.