7వేల కోట్ల స్కాం నిందితుడు అవ్వా సీతారాం అరెస్ట్


Tollywood TV Owner and Agri Gold Vice-President Avva Sitaram arrested in new delhi

7 వేల కోట్ల స్కాం లో నిందితుడు , టాలీవుడ్ ఛానల్ అధినేత అగ్రిగోల్డ్ ఉపాధ్యక్షుడు అయిన అవ్వా సీతారాం ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు దేశ రాజధాని ఢిల్లీ లో . సంచలనం సృష్టించిన స్కాం అగ్రి గోల్డ్ . దాదాపు 32 లక్షల మంది ప్రజలు పెద్ద ఎత్తున తమ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టారు అయితే జల్సాలకు అలవాటు పడిన అగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టుబడి పెట్టిన ప్రజలను నట్టేట ముంచాలని భావించి కిరాతకానికి పాల్పడ్డారు . అతిపెద్ద స్కాం అయిన అగ్రి గోల్డ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రముఖుల అండదండలు ఉన్నట్లు పలు రకాల ఆరోపణలు ఉండటంతో విచారణకు ఆదేశించింది చంద్రబాబు ప్రభుత్వం అయితే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు తో పాటు పలువురిని అరెస్ట్ చేసారు పోలీసులు .

అయితే టాలీవుడ్ ఛానల్ అధినేత , అగ్రిగోల్డ్ ఉపాధ్యక్షుడు అయిన అవ్వా సీతారాం మాత్రం మూడేళ్లు గా దేశ రాజధాని ఢిల్లీ లో తలదాచుకుంటున్నాడు . మూడేళ్ళుగా పారిపోయిన సీతారాం ని మొత్తానికి అరెస్ట్ చేసారు . 32 లక్షల ప్రజలను మోసం చేసిన ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో చెప్పలేము కానీ తమ రక్తాన్ని చెమటగా మార్చి పెట్టిన పెట్టుబడి రాబందుల పాలు కావడంతో వందలాది మంది ఆత్మహత్య కు పాల్పడ్డారు .