రేపు ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ పుష్ప అప్డేట్

రేపు ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ పుష్ప అప్డేట్
రేపు ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ పుష్ప అప్డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. అల వైకుంఠపురములో వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తోన్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటించే ఈ చిత్ర షూటింగ్ ఎప్పటినుండి మొదలవుతుంది అన్న విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.

ముందుగా ఏప్రిల్ లో అనుకున్నారు కానీ అది జరగలేదు. రీసెంట్ గా మిగతా సినిమాల షూటింగ్ లు మొదలైనా కానీ పుష్ప షూటింగ్ గురించి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు పుష్పకు సంబంధించిన కీలక అప్డేట్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

రేపు ఉదయం 10 గంటలకు పుష్పకు సంబంధించిన వీడియో ఒకటి విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఎలా జరిగాయి, షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించనుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది.