రేపు 6 సినిమాలు విడుదల


tomorrow six movies fight for successరేపు ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి అయితే అందులో ఎన్ని విజయాన్ని సాధిస్తాయో చెప్పలేం కానీ ఏ సినిమాపై కూడా అంతగా అంచనాలు లేకుండా పోయాయి . అన్ని కూడా చిన్న చిత్రాలు కావడంతో అందులో ఎన్ని ప్రేక్షకులను చేరుతాయి , చేరిన వాటిలో ఆకట్టుకునేవి ఎన్ని అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . రేపు విడుదల అవుతున్న చిత్రాల్లో ” చి ల సౌ ” , ” గూఢచారి ” , ” శివకాశీపురం ”, ” బ్రాండ్ బాబు ” , ” ఎవరు ? ” , ” మన్యం ” చిత్రాలు ఉన్నాయి . కాగా చిలసౌ చిత్రానికి నాగార్జున , సమంత , నాగచైతన్య సపోర్ట్ చేస్తున్నారు . పలు చిత్రాల్లో హీరోగా , సహాయ నటుడిగా నటించిన రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహించిన సినిమా చిలసౌ .

ఇక బుల్లితెర మెగాస్టార్ గా రాణిస్తున్న ఈటివి ప్రభాకర్ మరోసారి మెగాఫోన్ చేతబట్టిన చిత్రం ” బ్రాండ్ బాబు ” మారుతి కథ అందించాడు దాంతో ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని కాబట్టి ప్రేక్షకులకు నచ్చోచ్చని ఆశిస్తున్నారు . అడవి శేష్ కథ , స్క్రీన్ ప్లే అందించిన ” గూఢచారి ” కూడా రేపే విడుదల అవుతోంది . యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం పై అడవి శేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా నటించిన శివకాశీపురం చిత్రానికి హరీష్ వట్టికూటి దర్శకత్వం వహించాడు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై కూడా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . రేపు విడుదల అవుతున్న ఆరు చిత్రాల్లో ఎన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయో తెలియాలంటే ఒక్క రోజు వేచి చూస్తే తెలిసిపోతుంది .

English Title: tomorrow six movies fight for success