బెల్లంకొండ అస్సలు తగ్గను అంటున్నాడే!


 

Top cast and crew for Bellamkonda Srinivass next
Top cast and crew for Bellamkonda Srinivass next

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ మొదటినుండి ఒకటే పంథాను ఫాలో అయ్యాడు. తను చిన్న హీరో కాబట్టి తన చుట్టూ ఉండే సెటప్ భారీగా ఉండాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే ఈ స్ట్రాటజీ బెల్లంకొండకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అల్లుడు శీను, జయ జానకి నాయక సినిమాలు బాగున్నాయి అని పేరు తెచ్చుకున్నా కానీ ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఇక మిగతా సినిమాలన్నీ బొక్క బోర్లా పడ్డాయ్. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కొంత తగ్గినట్లే కనిపించాడు. సీత సినిమాకు లో బడ్జెట్ లోనే వెళ్ళాడు, వర్కౌట్ అవ్వలేదు. రాక్షసుడు సినిమాకు కూడా లో బడ్జెట్ నే ఎంచుకున్నాడు. ఈసారి అంత పేరున్న వాళ్ళను ఎవరినీ తీసుకోలేదు. సీత సినిమాలోనైనా కాజల్ అగర్వాల్ ఉందేమో కానీ రాక్షసుడులో అనుపమతోనే సెటిల్ అయ్యాడు. అయితే రాక్షసుడు వర్కౌట్ అయ్యింది. తన కెరీర్ లో మొదటి హిట్ గా నిలిచింది.

ఈ సినిమా హిట్ అయ్యాక అదే ఉత్సాహంలో వెంటనే సినిమాను చేసెయ్యలేదు బెల్లంబాబు. చాలా టైమ్ తీసుకున్నాడు. తన ఫిజిక్ ను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. లుక్ మార్చేశాడు. సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకున్నాడు. ఫైనల్ గా తన నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యాడు. రాక్షసుడు వంటి హిట్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే ఈసారి మళ్ళీ పాత రూట్ లోకే వెళ్ళాడు బాబు. అసలు ఎక్కడా తగ్గేదే లేదంటున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. రేపే ఈ సినిమాకు ఓపెనింగ్ ముహూర్తం. రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం మళ్ళీ భారీ సెటప్ నే కోరుకుంటున్నాడు బెల్లంకొండ.

హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ నభ నటేష్ ను తీసుకున్నాడు. ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం నభ క్రేజ్ మాములుగా లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది నభ. రవితేజ సరసన డిస్కో రాజాలో నటిస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలోనూ ఎంపికైంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందుకనే ఈ సినిమా కోసం నభ దాదాపు కోటిన్నర దాకా అందుకోబోతోందని తెలుస్తోంది.

క్రూ విషయంలో కూడా ది బెస్ట్ నే సెట్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. అల్లుడు శీను, జయ జానకి నాయక తర్వాత బెల్లంబాబుకి పని చేస్తున్నాడు దేవి. సంతోష్ శ్రీనివాస్ తో మాత్రం తొలిసారి. థమన్ తోనే పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ ఈసారి దేవికి షిఫ్ట్ అయ్యాడు. సినిమాటోగ్రాఫర్ గా బాలీవుడ్ టాప్ నే సెట్ చేసుకున్నారు. చెన్నై ఎక్స్ప్రెస్, గోల్ మాల్, సింగం, సింగం రిటర్న్స్ వంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ శ్రీనివాస్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు. మరి ఇంత సెటప్ పెట్టుకుని బెల్లంకొండ శ్రీనివాస్ ఏం చేస్తాడో చూడాలి.