కాలా చ‌ష్మా.. కామెడీ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్‌!

కాలా చ‌ష్మా.. కామెడీ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్‌!
కాలా చ‌ష్మా.. కామెడీ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్‌!

క‌రోనా వైర‌స్ భార‌తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీంతో ఈ క్రైసిస్ నుంచి కాపాడ‌టం కోసం ఎంతో మంది ప్ర‌ధాని స‌హాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి కూడా భారీ స్థాయిలో తార‌లు విరాళాలు ప్ర‌క‌టించారు. ప్ర‌క‌టిస్తున్నారు. హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన కార్మికులు, దిన‌స‌రి కూలీలు ఇడ్డందులు ఎదుర్కొంటున్నారు.

వారిని ఆర్థికంగా ఆదుకునే క్ర‌మంలో ఇండియ‌న్ టాప్ స్టార్స్ `ఫ్యామిలీ` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టించారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, మోహ‌న్‌లాల్, మ‌మ్ముట్టి, ర‌న్‌బీర్ క‌పూర్‌, ప్రియాంక చోప్నా, అలియాభ‌ట్‌, శివ‌రాజ్‌కుమార్‌, ప్ర‌సేన్ జిత్ చ‌ట‌ర్జీ, సొనాలీ కుల‌క‌ర్ణీ త‌దిత‌ర‌లు న‌టించారు. ప్ర‌సూన్ పాండే డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా, క‌ల్యాణ్ జువెల్ల‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

దీని ద్వారా వ‌చ్చే మొత్తాన్ని సినీ కార్మికుల కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఎక్క‌డి వారు అక్క‌డే వుండి స‌రికొత్త టెక్నాల‌జీతో రూపొందించారు. అమితాబ్ ఇంటిపెద్ద‌గా క‌నిపించారిందులో మిగ‌తా న‌టులంతా కుటుంబ స‌భ్యులుగా క‌నిపించారు. కాలా ఛ‌ష్మా కోసం సాగే కామెడీ షార్ట్ ఫిల్మ్ ఇది. ఇప్ప‌టికే ఇది 10.4కె వ్యూస్‌ని దాటేసింది.

Credit: Twitter