బాలకృష్ణ, ఎన్టీఆర్ పదాన్ని టైటిల్ గా పెట్టుకుంటాడా?


 

torchbearer is being considered for balayyas next movie
torchbearer is being considered for balayyas next movie

నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని ఆ మధ్య వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. దీనిపై ఎవరికి వారే క్లారిటీ ఇచ్చినా కానీ దీనిపై రూమర్స్ ఆగలేదు. వీరిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించకపోవడం, ఒకరి గురించి మరొకరు ఎక్కువగా ఈ మధ్య మాట్లాడుకోకపోవడంతో అందరూ అంతే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోని ఒక ముఖ్యమైన పదాన్ని బాలకృష్ణ తన సినిమాకు టైటిల్ గా పెట్టుకోనున్నాడు అని వార్తలు మొదలయ్యాయి.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఒక్క షెడ్యూల్ పూర్తైన వెంటనే కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపివేయాల్సి వచ్చింది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశముంది.

అయితే ఈ చిత్ర టైటిల్ విషయంలో ముందు నుండీ చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు టైటిల్ మోనార్క్ అని కొందరు, కాదు డేంజర్ అని మరికొందరు ఎవరికి వారే రూమర్స్ పుట్టించారు. అయితే ఈ విషయం తెలీదు కానీ ఈ సినిమా టైటిల్ అంటూ మరో పదం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు టార్చ్ బేరర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ అరవింద సమేతలో ఎన్టీఆర్ ను ఈ పదంతోనే సంభోదిస్తారు రావు రమేష్. ఆ సీన్ ఎలివేషన్ కూడా బాగుంటుంది.

మరి నిజంగానే ఈ టైటిల్ ను నిర్మాతలు కన్సిడర్ చేస్తున్నారా?.