`వ‌కీల్‌సాబ్‌` 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌!

Total  Collections  Vakeel Saab 5 days Worldwide collections
Total  Collections  Vakeel Saab 5 days Worldwide collections

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ఆధారంగా తెలుగులో ఈ మూవీని శ్రీ‌రామ్ వేణు రీమేక్ చేశారు. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ప‌వ‌ర్‌స్టార్ మూడేళ్ల విరామం త‌రువాత న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది.

బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఫ‌స్ట్ డే నుంచి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. 5 రోజుల‌కు గానూ ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 113.35 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేసింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 5 రోజుల్లో సాధించిన క‌లెక్ష‌న్ వివ‌రాలు ఇలా వున్నాయి.

నైజాం: 20.46 కోట్లు
సీడెడ్ : 10.74 కోట్లు
ఉత్త‌రాంధ్ర : 9.78 కోట్లు
ఈస్ట్ గోదావ‌రి : 5.47 కోట్లు
వెస్ట్ గోదావ‌రి : 6.16 కోట్లు
గుంటూరు : 6.18 కోట్లు
కృష్ణా : 4.17 కోట్లు
నెల్లూరు : 2.91 కోట్లు
ఏపీ, తెలంగాణ : 65.86 కోట్లు (100.70 కోట్ల గ్రాస్‌)
క‌ర్ణాట‌క, రెస్టాఫ్ ఇండియా : 3. 48 కోట్లు
ఓవ‌ర్సీస్ : 3.61 కోట్లు
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ : 72.95 కోట్లు (113.35 కోట్ల గ్రాస్‌)