బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు – ఆ ఇద్దరికీ ఇక కష్టమే


బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు - ఆ ఇద్దరికీ ఇక కష్టమే
బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు – ఆ ఇద్దరికీ ఇక కష్టమే

ఈసారి బిగ్ బాస్ పై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు కఠినమైన టాస్క్ లు ఇవ్వట్లేదని, ఊరికే కూర్చోబెట్టి షో ను నడిపిస్తున్నారని ఏదేదో అన్నారు. దానికి తోడు కంటెస్టెంట్స్ కూడా తమకసలు షో లో ఉండటమే ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ప్రవర్తించారు. ఎంత సేపు సేఫ్ గేమ్ ఆడుకుంటూ, గట్టిగా ఒక తప్పును ప్రశ్నిస్తే ఏమవుతుందోనన్న భయంతో ప్రవర్తించడం వంటివి చేసారు. దీనికి తోడు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున కూడా షో ను చూడకుండా ఒక స్క్రిప్ట్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్లడం, తప్పు చేసిన వాళ్ళని గట్టిగా నిలదీయకపోవడం, కొంత మంది దగ్గర ఫెవరెటిజం చూపించడం వంటివి చేయడంతో చాలా మందికి షో మీద ఆసక్తి సన్నగిల్లింది.

అయితే ఇక షో కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. షో లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో నుండి ఇప్పటికే రాహుల్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. దీంతో మిగిలిన ఐదుగురు లో నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, శివ జ్యోతి, అలీ రెజా నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే షో ఎండింగ్ కు వస్తున్న సమయంలో బిగ్ బాస్ లో ఆసక్తికర టాస్క్ లు మొదలయ్యాయి. నామినేషన్స్ ప్రాసెస్ అత్యంత కఠినతరంగా నిర్వహించగా, నిన్న ఎపిసోడ్ లో నామినేట్ అయిన సభ్యులకు కఠిన పరీక్షలు నిర్వహించారు.

ఇందులో భాగంగా నామినేట్ అయిన సభ్యులను ఒక బూత్ లో నిలబెట్టి మొత్తం 5 టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కోసారి ఒక్కొక్క నామినేట్ సభ్యుడు టాస్క్ ను బట్టి ఎంచుకోవచ్చు. ముందుగా ఇచ్చిన టాస్క్ ప్రకారం.. ఒక రాడ్ ఇచ్చి దాన్ని ఎదురుగా ఎత్తుగా ఉన్న రింగ్ అంచులకు తాకకుండా నుంచోవాలి. రాడ్ ఎత్తుగా ఉండడం, కొంచెం రింగ్ కు తాకినా మంటలు వస్తుండడంతో ఈ టాస్క్ కఠినతరం అనే చెప్పాలి. బిగ్ బాస్ చెప్పే వరకూ ఈ టాస్క్ చేస్తూనే ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి వరుణ్ సందేశ్ ముందుకు వచ్చాడు.

ఇక తర్వాత టాస్క్.. ఒక లావుగా ఉన్న పోల్ పెట్టి దానిపై నిలబడాలి. బిగ్ బాస్ చెప్పేవరకూ దాన్నుండి దిగకూడదు. పోల్ పై కాళ్ళు పెట్టుకునే స్థలం చిన్నగా ఉండడం, పోల్ ను చుట్టుకుని పట్టుకోవడానికి, అది చాలా లావుగా ఉండడంతో ఇది కూడా కష్టంగానే అనిపించింది. ఈ టాస్క్ చేయడానికి బాబా భాస్కర్ ముందుకు వచ్చాడు. ఇక మూడో టాస్క్.. పాళ్ళలో గుడ్లు వేసుకుని తాగాల్సి ఉంటుంది. బిగ్ బాస్ చెప్పేవరకూ తాగుతూనే ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి శివజ్యోతి ముందుకు వచ్చింది. నాలుగో టాస్క్ రెండు ఇసుక మూటల్ని రెండు చేతులతో రెడ్ లైన్ కిందకు దిగకుండా పట్టుకుని ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి అలీ రెజా ముందుకు వచ్చాడు. చిట్టచివరి టాస్క్ గా ఒక చేప నోట్లో మౌత్ ఆర్గాన్ పెట్టి దాన్ని బిగ్ బాస్ చెప్పే వరకూ ఊదుతూ ఉండాలి. మిగిలి ఉన్న శ్రీముఖి ఈ టాస్క్ ను మొదలుపెట్టింది.

బిగ్ బాస్ చాలా సేపటి వరకూ ఈ టాస్క్ ను అలాగే కొనసాగించాడు. తర్వాత ఒక్కొక్కరిగా ఈ టాస్క్ నుండి రిలీజ్ చేసారు. అందరూ బిగ్ బాస్ చెప్పేవరకూ ఎంత కష్టమైనా వారి టాస్క్ లు కొనసాగించడం విశేషం. ఇలాంటి టాస్క్ లు షో ముందు నుండి ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదిగా అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక హౌజ్ లో నామినేట్ అయిన సభ్యులు అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా అలీ రెజా, శివజ్యోతి మధ్య ఎలిమినేషన్ కోసం టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అర్ధమవుతోంది. మిగిలిన నామినేటెడ్ సభ్యులు శ్రీముఖి, వరుణ్, బాబా దాదాపు సేవ్ అయిపోయినట్లే. మరి అందరూ అనుకుంటున్నట్లు అలీ, శివ జ్యోతిలలో నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారా లేక సేవ్ అవుతారన్న ముగ్గురిలో నుండి ఒకరు వెళిపోతారా అన్నది చూడాలి.