ఫ్యాన్స్ ని కేక పెట్టిస్తున్న మెగాస్టార్ కామన్ డీపీ


Chiranjeevi Birth Day CDP
Chiranjeevi Birth Day CDP

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 దాంతో నిన్న రాత్రి చిరంజీవి కామన్ డీపీ అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు . ఆ పోస్టర్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు . తమ అభిమాన హీరో కు సంబందించిన ఒక ఫోటో అంటేనే ఎంతో పరవశించి పోతారు అలాంటిది చిరు నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాల నుండి ఏరికోరి సెలెక్ట్ చేసిన ఫోటోలతో కామన్ డీపీ ని రెడీ చేసి ఫ్యాన్స్ మీదకు వదలడంతో కేక పెడుతున్నారు మెగా ఫ్యాన్స్ .

రేపు రాత్రి చిరంజీవి జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి . ఏ వేడుకలో మెగా హీరోలు అందరూ పాల్గొననున్నారు . ఇక చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2 న విడుదల కానుంది . ఆ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ .