పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారు


మత్స్యుకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని , మాకు అన్యాయం చేయాలనీ చూస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ కు తగిన బుద్ది చెబుతామని వార్నింగ్ ఇస్తున్నారు గిరిజనులు . గిరిజన జె ఏ సి నాయకులు రవీంద్ర నాయక్ , కుళ్లాయి నాయక్ , నారాయణస్వామి నాయక్ లు పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోక పొతే ఆయన ఇంటిని ముట్టడించడం ఖాయం అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన కు గట్టిగా బుద్ది చెబుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసారు .

ఇటీవల మత్స్యుకారులు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు , దాంతో స్పందించిన పవన్ ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేయడంతో గిరిజనులకు కోపం వస్తోంది . ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వాల్మీకి , బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది దాంతోనే మాకు ఇబ్బందులు వస్తాయని , మా ఉద్యోగాలు , ఇతర హక్కులు పోతాయని భయపడుతుంటే కొత్తగా పవన్ కళ్యాణ్ మత్స్యుకారులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని అంటుండటంతో ఇలా వార్నింగ్ ఇస్తున్నారు .