పీరియాడిక్ కామెడీ డ్రామాలో రవితేజ!trinadharao nakkina raviteja movie to be periodic comedy drama
trinadharao nakkina raviteja movie to be periodic comedy drama

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెల్సిందే. వరసగా రవితేజ నటించిన సినిమాలు అన్నీ ప్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ప్రస్తుతం క్రాక్ అనే పోలీస్ డ్రామా చేస్తోన్న రవితేజ మరోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాకు కమిటైన విషయం తెల్సిందే.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా పీరియాడిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోందిట. రిట్రో ఫీల్ అధికంగా ఉండేలా ఈ సినిమా కథను రచించాడట త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం రవితేజ చేస్తోన్న క్రాక్ పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. పీరియాడిక్ కథల్లో కామెడీ ఎంటర్టైనర్ అనేది చాలా అరుదు. అందుకే ఆ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా రవితేజ క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

క్రాక్, త్రినాథరావు నక్కిన చిత్రాలు కాకుండా రవితేజ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే.