మెగా 152కు ఆమె కన్ఫర్మ్ అయినట్టేనా?


మెగా 152కు ఆమె కన్ఫర్మ్ అయినట్టేనా?
మెగా 152కు ఆమె కన్ఫర్మ్ అయినట్టేనా?

భరత్ అనే నేను చిత్రం పూర్తి చేసినప్పటి నుండి చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నాడు కొరటాల శివ. సైరా షూటింగ్ డిలే అవుతూ రావడంతో చిరు – కొరటాల శివ చిత్రం కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సైరా పూర్తై విడుదలవడంతో చిరంజీవి కూడా ఫ్రీ అయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెల నుండి షూటింగ్ మొదలుకానుంది.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. అయితే ఇప్పటిదాకా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. నయనతార, అనుష్క, కాజల్ వంటి హీరోయిన్లను పరిశీలించారు కానీ చిరు పక్కన త్రిష అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. త్రిష ఇప్పటికే చిరంజీవితో స్టాలిన్ లో నటించింది.

సీనియర్ హీరోల పక్కన ఇప్పుడు త్రిష సూట్ అవుతోంది. ఇప్పటికీ ఆమెకు క్రేజ్ బానే ఉంది. పైగా కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద రోల్స్ ఉండవు. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా చూసి త్రిషను సెలెక్ట్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. మరోవైపు సంగీత దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.