మెగాస్టార్‌పై త్రిష ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌!

మెగాస్టార్‌పై త్రిష ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌!మెగాస్టార్‌పై త్రిష ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌!

తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ క‌థానాయిక‌గా,  స్టార్ హీరోయిన్‌గా ద‌శాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగింది త్రిష‌. గ‌త కొంత కాలంగా త‌మిళ చిత్ర‌సీమ‌కే ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. మంగ‌ళ‌వారం త్రిష పుట్టిన రోజును జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెను విష్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కార‌ణంగా `ఆచార్య‌` చిత్రం నుంచి త్రిష త‌ప్పుకున్నా చిరు మాత్రం ఆ విష‌యాన్ని లైట్ తీసుకుని త్రిష‌ని విష్ చేశారు. `జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు త్రిష‌. నీ జీవితం సంతోషం, విజ‌యంతో నిండిపోవాల‌ని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్ప‌గా వుండాల‌ని ఆశిస్తున్నా` అని ట్వీట్ చేశారు. దీనికి త్రిష నుంచి రిప్లై వ‌చ్చింది.

స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధ‌న్య‌వాదాలు` అని బ‌దులిచ్చింది త్రిష‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `స్టాలిన్‌` చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత వీరిద్ద‌రూ క‌లిసి `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తార‌ని అంతా భావంచారు. కానీ త్రిష మాత్రం క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది.