ఆమె దృష్టిలో బెస్ట్ యాక్ట‌ర్స్ లేరా?


ఆమె దృష్టిలో బెస్ట్ యాక్ట‌ర్స్ లేరా?
ఆమె దృష్టిలో బెస్ట్ యాక్ట‌ర్స్ లేరా?

క‌రోనా కార‌ణంగా స్టార్స్ షూటింగ్ లేక‌పోవ‌డంతో ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? ఎప్పుడు సినిమా షూటింగ్స్ మొద‌ల‌వుతాయా? అని ఎదురుచూస్తున్నారు. వీలైన‌ప్పుడు సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల‌కు అందుబాటులోకి వ‌స్తున్నారు. తాజాగా త్రిష కూడా అంద‌రిలానే ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది.

అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి చ‌క‌చ‌కా స‌మాధానాలు చెప్పింది. అయితే మీకు న‌చ్చిన అభిమాన న‌టులు  ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు త్రిష చెప్పిన స‌మాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు న‌చ్చిన న‌టులు ఎవ‌రంటే క‌మ‌ల్‌హాస‌న్‌, మోహ‌న్‌లాల్‌, అమీర్‌ఖాన్ అంటూ చెప్పేసింది. ఆ లిస్టులో ఏ ఒక్క తెలుగు హీరో, తెలుగు న‌టుడి పేరు లేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అనివార్య కార‌ణాల వ‌ల్ల త‌ను త‌ప్పుకుంటున్నానంటూ త్రి‌ష వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.