పెళ్లి కోసం ప్లేస్ ఫిక్స్ చేసుకుందిగా!


పెళ్లి కోసం ప్లేస్ ఫిక్స్ చేసుకుందిగా!
పెళ్లి కోసం ప్లేస్ ఫిక్స్ చేసుకుందిగా!

తెలుగు, త‌మిళ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స్టార్ త్రిష‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్స్ అంద‌రితో క‌లిసి న‌టించింది. దాదాపు 18 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో త్రిష మ‌ర్చిపోలేని విజ‌యాల్నే సొంతం చేసుకుంది. తెలుగులో గ‌త కొంత కాలంగా సినిమాలు త‌గ్గించుకున్న త్రిష త‌మిళంలో మాత్రం అదే జెరుని కొన‌సాగిస్తోంది. త‌మిళంలో ఆమె న‌టించిన `96` అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా 11 అవార్డుల్ని త్రిష‌కు తెచ్చిపెట్టింది.

కొంత విరామం త‌రువాత మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఓ సినిమాని అంగీక‌రించిన త్రిష పెళ్లి కోసం కొత్త ప్లేస్‌ని ప్ర‌క‌టించ‌డం త‌మిళ చిత్ర వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త్రిష కొన్నేళ్ల క్రితం నిర్మాత‌, యువ వ్య‌మాపార వేత్త వ‌రుణ్ మ‌నియ‌న్‌తో స‌న్నిహితంగా మెలిగిన త్రిష అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచింది. ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో త్రిష‌, వ‌రుణ్ మ‌నియానిల నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ త్రిష హ‌ఠాత్తుగా త‌న ఎంగేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేసుకోవ‌డం కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది.

పెళ్లి త‌రువాత కూడా త్రిష నట‌న‌ను కొన‌సాగిస్తాన‌ని చెప్ప‌డం వ‌ల్లే వ‌రుణ్ పెళ్లిని ర‌ద్దు చేసుకున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు షికారు చేశాయి. అయితే దానిపై ఇప్ప‌టికీ త్రిష‌ క్లారిటీ ఇవ్వ‌లేదు. తాజాగా త‌న కోరిక‌ల లిస్ట్ చెప్ప‌మ‌ని, పెళ్లి ఎప్పుడు ఎక్క‌డ చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్నించార‌ట‌. దానికి త్రిష నుంచి షాకింగ్ స‌మాధానం వ‌చ్చిన‌ట్టు తెలిసింది. లాస్ వెగాస్‌లో  డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని ఉందని త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఎప్పుడు వివాహం చేసుకోబోతున్న‌ది మాత్రం వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరుత్సాహ‌ప‌డుతున్నార‌ట‌.