మణిరత్నం పైనే ఆశలు పెట్టుకున్న త్రిష


 

Trisha hopes on mani ratnam
Trisha hopes on mani ratnam

మణిరత్నం గారి సినిమాల్లో హీరోయిన్స్ అచ్చం కవులు వర్ణించే కావ్యాలలో ఉండే దేవకన్యల మాదిరిగా ఉంటారు.. కాదు సర్ అలా చూపిస్తారు. మణి సర్ హీరోయిన్స్ స్క్రీన్ స్పేస్ ని జస్ట్ ఫిల్ చెయ్యరు. స్క్రీన్ ని ఇంకా బ్రైట్ చేస్తారు. వాళ్ళ అమాయకత్వం, ప్రేమ, చిలిపితనం, కోపం, బాధ ఇలా ఒక్క పాత్రలో అన్నిరకాల ఎమోషన్స్ క్యారీ చేస్తారు. తొలినాళ్ళలో ఆయన చేసిన పల్లవి – అనుపల్లవి దగ్గరనుండి ఈమధ్య రిలీజ్ అయిన చెక్క చివంత వనం వరకూ మణి సర్ హీరోయిన్స్ అంటే యావత్ ఇండియన్ ఇండస్ట్రీ లో ఇక బ్రాండ్. 10 సినిమాలు చేసినా దక్కని గుర్తింపు సినిమా ఫ్లాప్ అయినా మణి సర్ సినిమాలో వస్తుంది. అందుకు ప్రధాన ఉదాహరణ అందాల తార ఐశ్వర్యా రాయ్. ఇరువర్ సినిమాలో పుష్ప నుండి మొదలెడితే రావణ్ సినిమా వరకూ మధ్యలో గురు సినిమా ఇలా ఐష్ కెరియర్ బెస్ట్ సినిమాలు ఇచ్చారు మణి సర్. జ్యోతిక, అమలా అక్కినేని, మధుబాల, మనీషా కొయిరాల, అదితి రావు హైదరీ, మీరా జాస్మిన్ ఇలా ఎందరో ఆరిస్ట్ లలో తమకు తెలియని గొప్ప నటను మణి సర్ పరిచయం చేస్తారు

తాజాగా మణిరత్నం సర్ తమిళ దిగ్గజ రచయిత కల్కి కృష్ణమూర్తి విరచిత 2400 పేజీల మహాగ్రంధం అయిన “పోన్నియన్ సెల్వన్” (కావేరి పుత్రుడు)ను సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన “ఆరుల్మోజి వర్మన్” పాత్రను ను జయం రవి చేస్తుండగా, మరో ముఖ్య పాత్ర అయిన “వందియదేవన్” పాత్రను కార్తి చేస్తున్నారు. అసలు కార్తి మొదటి సినిమానే “ఆయిరత్తిల్ ఒరువన్ ” పీరియాడిక్ సినిమా కావడం గమనార్హం. ఇక ఈసినిమాలో కార్తి సరసన “కుందవై” అనే పాత్రలో నటి త్రిష ఎంపికయ్యారు అని తెలుస్తోంది.మరో రెండు ముఖ్య పాత్రలైన “పలవేట్టరయర్” మరియు “నందిని” పాత్రను శరత్ కుమార్ & ఐశ్వర్యా రాయ్ చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజం ఉంటే త్రిష పంట పండినట్లే అని ఇండస్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.