త్రిష టిక్ టాక్ ఎంట్రీ అదుర్స్‌!


త్రిష టిక్ టాక్ ఎంట్రీ అదుర్స్‌!
త్రిష టిక్ టాక్ ఎంట్రీ అదుర్స్‌!

ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా అయిపోయింది. ఇప్పుడంతా టిక్ టాక్ మీద ప‌డ్డారు. పామార్యుల్ని కూడా టిక్ టాక్ సెల‌బ్రిటీలుగా మార్చేస్తోంది. దీని రీచింగ్ కూడా ఎక్కువే వుండ‌టం, అంతా స్మార్ట్ ఫోన్‌ల‌కు ఎడిక్ట్ కావ‌డంతో స్టార్స్ కూడా టిక్ టాక్ వీడియోలు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇలా స్టార్‌లు చచేసిన వీడియోల‌కి కూడా వ్యూస్ భారీ స్థాయిలో వ‌స్తుండ‌టంతో తాజాగా మ‌రో స్టార్ హీరోయిన్ టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ స్టార్ హీరోయిన్ త్రిష‌. ఎంట్రీ ఇచ్చిందే త‌డ‌వుగా పాపుల‌ర్‌ హాలీవుడ్ గాయ‌ని మేగాన్ నీ స్టాలియ‌న్ పాడిన `సేవేజ్‌.. కు త్రిష చిందులేసి ఆ వీడియోని టిక్ టాక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా త్రిష ఎంట్రీ, డ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ న‌డుస్తోంది.

లాక్ డౌన్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుంటూ త‌మ‌కు న‌చ్చిన ప‌ను్లో బిజీగా గ‌డిపేస్తున్నారు. త్రిష వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా స్నేహితుల‌తో వీడియో కాల్స్ మాట్లాడుతూ మ‌ధ్య మ‌ధ్య‌లో ఇలాంటి చిలిపి వీడియోలు చేస్తోందట‌. అన్న‌ట్టు త్రిష ఇటీవ‌ల చిరు చిత్రం నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

Trisha on TikTok ??? #trishakrishnan #trishaafp

A post shared by Trisha Krishnan ? (@trishaa.fp) on

Credit: Instagram