విదేశీయుడి ప్రేమలో త్రిష


trisha in love with NRIఅందాల భామ త్రిష ఓ విదేశీయుడిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది . 35 ఏళ్ల త్రిష కు ఇప్పటివరకు పెళ్లి కాలేదు అయితే గత ఏడాది ఈ భామకు పెళ్లి మీద గాలి మళ్లింది దాంతో తమిళ నిర్మాత వరుణ్ మణియన్ ని ప్రేమించి వివాహ నిశ్చితార్థం కూడా చేసుకుంది , ఆ తర్వాత రకరకాల దేశాలు తిరిగారు కట్ చేస్తే వాళ్లకు అభిప్రాయబేధాలు వచ్చాయి దాంతో జరగాల్సిన పెళ్లి రద్దు అయ్యింది ఇక అప్పటి నుండి మళ్ళీ సినిమాల మీదకు గాలి మళ్లించింది కానీ ఈలోపు తనకు తగిన జోడి ఎవరూ ? అంటూ వెదుకుతూనే ఉంది .

ఇంకేముంది వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఓ పరదేశి ని చూసి మనసు పారేసుకుంది త్రిష . గతకొంత కాలంగా ఆ పరదేశి తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది త్రిష . ఈ భామ గతకొద్దిరోజులుగా విదేశీ ప్రేమికుడితో న్యూయార్క్ లో సంచరిస్తోంది . ఆ విదేశీ ప్రియుడికి అమెరికాతో పాటుగా బ్రిటన్ లో పలు బిజినెస్ లు ఉన్నాయట .

పార్టీ లు , పబ్ లు అంటే త్రిష కు ఎనలేని ఇష్టం , గతంలో పలుమార్లు చెన్నై లో అర్ధరాత్రి సమయాల్లో పబ్ లోనే కాకుండా నగర రోడ్ల పై కూడా పార్టీ చేసుకొని వివాదాస్పదం అయ్యింది . ఇక ఈ విదేశీయుడి తో ఉన్నది ప్రేమా ? స్నేహమా ? అన్నది ఈ భామే చెప్పాలి . ఎందుకంటే తేడా వస్తే జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అనే డైలాగ్ కొడతారు కదా !

English Title: trisha in love with NRI