ఎక్స్‌ల గురించి చెప్పేవాళ్లు సైకోల‌ట‌!ఎక్స్‌ల గురించి చెప్పేవాళ్లు సైకోల‌ట‌!
ఎక్స్‌ల గురించి చెప్పేవాళ్లు సైకోల‌ట‌!

త్రిష ఈ మ‌ధ్య వార్త‌ల్లో నిలుస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి త‌ప్పుకుని వార్త‌ల్లో నిలిచిన త్రిష తాజాగా మ‌ళ్లీ ఇన్‌స్టా వేదిక ఓ వివాదాస్ప‌ద పోస్ట్‌ని షేర్ చేసి మ‌ళ్లీ వెంట‌నే డిలిట్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రిపై? .. ఎందుకింత ఫ్ర‌స్టేష‌న్‌కి గుర‌వుతోంది? అని అంతా ఆరాతీస్తున్నారు.

ఇంత‌కీ త్రిష ఇన్ స్టా వేదిక షేర్ చేసిన కామెంట్ ఏంటంటే ప్రేమించినంత కాలం ప్రేమించి ఆ త‌రువాత వారిని త‌మ మాజీ ల‌వ‌ర్స్‌గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేవాళ్లు సైకోల త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టే అని ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ చేసింది. ఇంత‌లోనే ఏమైందో ఏమో తెలియ‌దు కానీ వెంట‌నే ఆ పోస్ట్‌ని డిలిట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ త్రిశ సైకోగా అభివ‌ర్ణించింది ఎవ‌రిని?. వాళ్ల‌పై త్రిష‌కు ఎందుకింతలా కోపం వ‌చ్చింది అంటే నెటిజ‌న్స్ మాత్రం ఆ పోస్ట్ పెట్టింది హీరో రానాను ఉద్దేశించేమో అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో చాలా సార్లు త్రిష‌, రానాల గురించి వ‌రుస క‌థ‌నాలు వినిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు రానా వెల్ల‌డించ‌డం, అందుకు ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీక‌రించ‌డం, డిసెంబ‌ర్‌లో వివాహం చేయాల‌నుకుంటున్నామ‌ని డి. సురేష్‌బాబు వెల్ల‌డించ‌డం తెలిసిందే.