17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి త్రిష పోలీస్ గా..



17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి త్రిష పోలీస్ గా..
17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి త్రిష పోలీస్ గా..

సౌత్ ఇండస్ట్రీలో త్రిష చెరగని స్థానం సంపాదించుకుంది. గత దశాబ్దన్నరగా త్రిష ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్ లలో త్రిష టాప్ ప్లేస్ కు చేరుకుంది. దాదాపు అందరు టాప్ హీరోల సరసన త్రిష ఆడిపాడింది. గత కొంత కాలం నుండి త్రిష రూట్ మార్చింది. గ్లామరస్ పాత్రలకు స్వస్తి చెప్పి, హీరోయిన్ కు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటూ వస్తోంది. గతేడాది తమిళంలో 96 చిత్రంతో అందరి మన్ననలు అందుకుంటోంది. త్రిష హీరోయిన్ గా అరంగేట్రం చేసి 17 ఏళ్ళు పూర్తయినా కానీ ఇంకా తనదైన శైలిలో సినిమాలను చేసుకుంటూ ముందుకెళుతోంది.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటించే అవకాశం త్రిషను వరించింది. అయితే వివిధ కారణాల వల్ల త్రిష ఆ ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం, త్రిష, ప్రియమణితో కలిసి ఒక సినిమా చేయనుంది. ఈ చిత్రంలో త్రిషదే కీలక పాత్ర కాగా తన కెరీర్ లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అయితే అది అండర్ కవర్ గానా లేక సీఐడి తరహా పాత్రనా అన్నది తెలియాల్సి ఉంది.

కుట్రపయిరిచి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలా శిష్యుడు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.