ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ రోలింగ్‌కి అంతా రెడీ!


ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ రోలింగ్‌కి అంతా రెడీ!
ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ రోలింగ్‌కి అంతా రెడీ!

మాట‌ల మాంత్రికుడు,  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం తెర‌పైకి రానున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి తొలి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `అర‌వింద స‌మేత‌`. ఈ మూవీ త‌రువాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌నున్నారు.

ఇది ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్రం. ప్రస్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మెగా ప‌వ‌ర్‌స్టార్‌తో క‌లిసి `ఆర్ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా కార‌ణంగా `ఆర్ఆర్ఆర్‌` షూటింగ్  ఆల‌స్యం అవుతూ రావ‌డంతో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌ల చిత్రం కూడా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఫైన‌ల్‌గా ఈ మూవీ రోలింగ్‌కి అంతా రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే నెల ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఈ శ‌నివారం హీరో ఎన్టీఆర్‌ని క‌లిసిన త్రివిక్ర‌మ్ ఫొటోలు నెట్టించ సంద‌డి చేస్తున్నాయి. ఈ ఫొటోల‌ని షేర్ చేసిన యువ నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీ రోలింగ్ వెరీ సూన్ అంటూ పోస్ట్ పెట్ట‌డంతో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు క్లారిటీ వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.