నితిన్ కోసం మాట‌ల మాంత్రికుడు వ‌చ్చేస్తున్నాడు!


 

Trivikram chif guest for Bheeshma pre release event
Trivikram chif guest for Bheeshma pre release event

నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `భీష్మ‌`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క‌న్న‌డ క‌స్తూరి, క్రేజీ గాళ్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. భీష్మ అనే బ‌యోఫామ్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ ఇది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సింగిల్స్ అంథెం సినిమాపై అంచ‌నాల్నిపెంచేస్తోంది. ఈ పాట‌లో నితిన్ శోభ‌న్‌బాబు రింగుతో చిరు స్టైల్ ష‌ర్ట్‌తో ర‌చ్చ చేయ‌డంతో సినిమా కొత్త‌గా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ శ‌నివారం త‌ను కోరుకున్న ప్రేయ‌సితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని ప‌లువురికి షాకిచ్చిన నితిన్ మ‌రో రెండు రోజుల్లో మ‌రో స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. కొత్త పంథాలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 17న హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో భారీగా నిర్వ‌హించ‌బోతున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌టించింది. నితిన్ సినిమాల‌కు ప‌వ‌ర్‌స్టార్ చీఫ్ గెస్ట్‌గా రావ‌డం, అవి సూప‌ర్ హిట్‌లుగా మార‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కొత్త‌గా త్రివిక్ర‌మ్ వ‌స్తుండ‌టంతో ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తుంద‌ని అంతా భావిస్తున్నారు.