ఎన్టీఆర్ 30 అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది!


ఎన్టీఆర్ 30 అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది!
ఎన్టీఆర్ 30 అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెకెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా క‌నిపించ‌బోతున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్ర తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా వున్న 10 ప్ర‌ధాన భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమా ఏంటి? ఎవ‌రితో వుంటుంది? అనే చ‌ర్చ మొద‌లైంది. ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పైకొచ్చాయి. ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ ఎన్టీఆర్ న‌టించ‌నున్న చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ని మేక‌ర్స్ బుధ‌వారం సాయంత్రం వెల్ల‌డించారు.

ఎన్టీఆర్ న‌టించ‌నున్న 30వ చిత్ర‌మిది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇక ప్ర‌త్యేక‌మైన విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తో క‌లిసి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారు. `ఆర్ ఆర్ ఆర్` పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొద‌లుపెట్టి వ‌చ్చే ఏడాది 2021 స‌మ్మ‌ర్‌కి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.