త్రి‌విక్ర‌మ్ – రామ్‌ల సినిమాపై స‌స్పెన్స్ కంటిన్యూస్‌!

త్రి‌విక్ర‌మ్ - రామ్‌ల సినిమాపై స‌స్పెన్స్ కంటిన్యూస్‌!
త్రి‌విక్ర‌మ్ – రామ్‌ల సినిమాపై స‌స్పెన్స్ కంటిన్యూస్‌!

గ‌త ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్. ఈ సినిమా త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఆయ‌న 30వ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై తాజాగా హీరో రామ్ స్పందించారు. `ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత మాంచి జోష్ మీదున్న రామ్ ప్ర‌స్తుతం  `రెడ్‌` మూవీలో న‌టించారు. ఈ మూవీ ఈనెల 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో మీడియా ముందుకు వ‌చ్చిన రామ్ తను త్రివిక్ర‌మ్‌తో క‌లిసి చేయ‌నున్న సినిమా గురించి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే వుంద‌ని, త్వ‌ర‌లో దీనికి సంబంధించిన ఓ క్లారిటీ వ‌స్తుందని స్ప‌ష్టం చేశారు.

త్రివిక్ర‌మ్ వ‌చ్చే నెల నుంచి ఎన్టీఆర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇది పూర్త‌యితే గానీ త్రివిక్ర‌మ్ మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేడు. ఆ కార‌ణంగానే రామ్ తో సినిమాని స‌స్పెన్స్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది.