కొత్త ట్రెండ్- చిన్న సినిమాలకు గురూజీ నామకరణం


Trivikram Launched pitta Katha movie first look
Trivikram Launched pitta Katha movie first look

ఒక రైటర్ గా ఆయన పదును, ఒక డైరెక్టర్ గా ఆయన విజన్ మనకందరికీ తెలుసు. సినిమాలో ఎంత చెప్పినా, పబ్లిక్ డయాస్ పై గురూజీ మైక్ తీసుకున్నడంటే అంతా సైలెంట్ అయిపోయి రికార్డింగ్ ఆన్ చేసుకుంటున్నారు. ఇక ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా త్రివిక్రమ్ చెప్పే సబ్జెక్ట్ కి అంత డిమాండ్ ఉంది. గతంలో పిల్లలకు లెక్చరర్ గా చేసిన గురూజీ ఇప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి మరొక ట్రెండ్ స్టార్ట్ చేసాడు. తన దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వచ్చిన యంగ్ టీమ్ సినిమా టైటిల్స్ విషయంలో ఆలోచిస్తుంటే, కథ టూకీగా చెప్పించుకుని, వాళ్ళు డిస్కస్ చేసే ఆప్షన్స్ లో ఒక మంచి టైటిల్ తనే ఫిక్స్ చేసి విషెస్ చెప్పాడు.

చందు ముద్దు దర్శకత్వంలో భవ్య ఆనంద ప్రసాద్ నిర్మాతగా వస్తున్న సినిమాకు పిట్ట కథ అనే టైటిల్, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనే క్యాప్షన్ సజెస్ట్ చేసారు గురూజీ. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా త్రివిక్రమ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరి ప్రేమ కథ అని, మార్చ్ లో విడుదల చేస్తామని”, చిత్ర ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి తెలిపారు.