భారీ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్ బాధ్య‌త‌లు‌ త్రివిక్ర‌మ్ చేతికి?

భారీ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్ బాధ్య‌త‌లు‌ త్రివిక్ర‌మ్ చేతికి?
భారీ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్ బాధ్య‌త‌లు‌ త్రివిక్ర‌మ్ చేతికి?

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ దాదాపు ఏడాది క్రితం `దంగ‌ల్‌` ఫేమ్ నితీష్ తివారీతో రామాయ‌ణ గాధ‌ని భార‌తీయ భాష‌ల్లో దాదాపు 500 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని అల్లు అర‌వింద్ బాలీవుడ్‌కు చెందిన స్టార్ ప్రొడ్యూస‌ర్‌ల‌తో క‌లిసి నిర్మించ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా దీనికి సంబంధించి ఎలాంటి వార్త బ‌య‌టికి రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇక లేన‌ట్టే అన్న వార్త‌లు షికారు చేశాయి.

ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ `ఆది పురుష్‌` కూడా రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో రూపొందుతుండ‌టంతో అల్లు అర‌వింద్ రామాయ‌ణం ప్రాజెక్ట్ లేన‌ట్టే అనుకున్నారంతా. కానీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ అత్యంత ర‌హ‌స్యంగా పూర్త‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భారీ పౌరాణిక గాధ‌కు సంబంధించిన తెలుగు వెర్ష‌న్ స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

టాలీవుడ్‌లో వున్న స్టార్ డైరెక్ట‌ర్‌ల‌లో త్రివిక్ర‌మ్‌కు పురాణాల‌పై మంచి ప‌ట్టువుంది. దీంతో రామాయ‌ణ గాధ తెలుగు వెర్ష‌న్‌ని సిద్ధం చేయ‌డానికి త్రివిక్ర‌మ్ మంచి ఆప్ష‌న్ అని అల్లు అర‌వింద్ భావించార‌ట‌. అందుకే ఆ బాధ్య‌త‌ల్ని త్రివిక్ర‌మ్‌కు అప్ప‌గించార‌ట‌. స్క్రిప్ట్ వ‌ర్క్ తో పాటు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ కూడా త‌నే రాస్తున్నార‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు సంబంధించిన వ‌ర్క్ ఫుల్ స్వీంగ్ లో వుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ ని అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.