మ‌ల‌యాళ హిట్ సినిమా స్క్రిప్ట్ చేతులు మారిందా?మ‌ల‌యాళ హిట్ సినిమా స్క్రిప్ట్ చేతులు మారిందా?
మ‌ల‌యాళ హిట్ సినిమా స్క్రిప్ట్ చేతులు మారిందా?

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్‌లుగా నిలిచిన చిత్రాల్ని తెలుగులో వ‌రుస‌గా రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కొంత మంది రీమేక్ చేస్తుంటే కొన్ని చిత్రాల్ని `ఆహా` లో అనువ‌దించి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి `లూసీఫ‌ర్‌` ని రీమేక్ చేయాల‌ని ప్టాన్ చేయ‌డం, క‌థ సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డం .. దాంతో దాన్ని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్ట‌డం తెలిసిందే. ఇక యంగ్ ప్రొడ్యూస‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవ‌ర నాగ‌వంశీ తాజా రెండు మ‌ల‌యాళ హిట్ చిత్రాల రీమేక్ హ‌క్కుల్ని పోలీప‌డి మ‌రీ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

ఇందులో ఒక‌టి `క‌ప్పెల‌`, మ‌రొక‌టి `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. పృథ్విరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ ఇందులో హీరోలుగా న‌టించారు. మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని సూర్య‌దేవ‌ర నావంశీ తెలుగు నేటివిటీ కోసం రైట‌ర్స్‌ని ఏర్పాటు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేయించారు.

అయితే స్క్రిప్ట్ ఊహించిన స్థాయిలో సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డంతో ఈ స్క్రిప్ట్‌ని గురూజీ త్రి‌విక్ర‌మ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ట‌. త్ర‌విక్ర‌మ్ చెయ్యిప‌డితేనే పెద్ద హీరోలు ఈ చిత్రంలో న‌టించ‌డానికి ముందుకొస్తార‌ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భావిస్తున్నార‌ట‌. ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఆ ఆత్రాన్ని ప్రారంభించ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా వుంద‌ట‌. దాంతో ఈ స‌మ‌యాన్ని `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` స్క్రిప్ట్‌ని రివ్రైట్ చేసేందుకు వినియోగించ‌బోతున్నార‌ట‌. ఈ రీమేక్‌ని ఎవ‌రు చేస్తారు? ఏంట‌నేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ముందు ఈ చిత్రాన్ని రానా, బాల‌కృష్ణ‌తో లేదా, రానా, ర‌వితేజ‌తో రీమేక్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.