త్రి‌విక్ర‌మ్ – సూర్య కాంబో నిజ‌మేనా?



Trivikram plannig a crezy film with hero suriya
Trivikram plannig a crezy film with hero suriya

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మ‌యించ‌నున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత త్రి‌విక్ర‌మ్ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌బోతున్నారా? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో మూవీ త‌రువాత త్రి‌విక్ర‌మ్ త‌మిళ హీరో సూర్య‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల సూర్య కోసం ఓ క‌థ‌ని రెడీ చేసి న‌రేట్ చేసిన త్రివిక్ర‌మ్ వెంట‌నే ఓకే చేయించుకున్నార‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సూర్య హీరోగా న‌టించిన తాజా చిత్రం `ఆకాశ‌మే హ‌ద్దుగా`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి. ఆర్ . గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని స్వ‌యంగా హీరో సూర్య నిర్మించారు. కొంత భాగం చిత్రీక‌ర‌ణ చేయాల్సి వుంది. క‌రోనా కార‌ణంగా అది డిలే అవుతూ వ‌స్తోంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లేదా వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.