మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్‌?


మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్‌?
మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్‌?

త్రి‌విక్ర‌మ్‌, మ‌హేష్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండ‌వ  చిత్రం `ఖ‌లేజా`. ఈ మూవీ విడుద‌లై ఇటీవ‌ల ప‌దేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆనాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్న మ‌హేష్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌డానికి  రెడీగా వున్నాన‌ని హింట్ ఇచ్చేశాడు. యితే ఈ కాంబినేష‌న్‌పై తాజాగా మ‌రో వార్త హల్ చ‌ల్ చేస్తోంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని చేస్తున్న త్రివిక్ర‌మ్ ఈ మూవీ త‌రువాత మ‌హేష్ తో మ‌ల్టీస్టార్ మూవీని చేయ‌బోతున్నారంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో మ‌హేష్‌తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌టించే అవ‌కాశం వుంద‌న్న‌ది తాజా టాక్‌. మ‌హేష్‌, వెంక‌టేష్ క‌లిసి గ‌తంలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` చిత్రంలో క‌లిసి న‌టించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి మ‌రిన్ని మ‌ల్టీస్టార‌ర్‌ల‌కు పునాది వేసింది.

ఈ ఇద్ద‌రి గురించి బాగా తెలిసిన త్రివిక్ర‌మ్ వీరికి త‌గ్గ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌ని సిద్ధం చేస్తున్నార‌ట‌. `ఆర్ ఆర్ ఆర్‌` వంటి మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ స్ఫూర్తితో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్‌ని మ‌రింత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురావాల‌నుకుంటున్నార‌ట‌.