అల వైకుంఠాపురాన్ని చుట్టేస్తున్నారా?


Ala Vaikunthapuramlo
అల వైకుంఠాపురాన్ని చుట్టేస్తున్నారా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సినిమాలు ఆలస్యంగా తీస్తాడనే పేరుంది. అయితే ఈ మధ్యన దాన్ని కొంత కవర్ చేసాడు కూడా. ఆలస్యాన్ని కవర్ చేయడంలో త్రివిక్రమ్ తప్పులు చేస్తున్నాడు. అజ్ఞాతవాసి విషయంలో అదే జరిగింది. సినిమాను చాలా తక్కువ సమయంలో చుట్టేసిన ఫీలింగ్ కలిగింది. సాధారణ ప్రేక్షకులకు. షూటింగ్ సంగతి అటుంచి కనీసం కథ విషయంలో మినిమం కేర్ తీసుకోలేదు.

మరోసారి త్రివిక్రమ్ అదే తప్పు చేస్తున్నాడా అనిపిస్తోంది అల వైకుంఠపురములో సినిమా చిత్రీకరణ జరిగిన తీరు చూస్తుంటే. ఈ సినిమా షూటింగ్ మొదలుకావడమే ఆలస్యంగా మొదలైనా ఈ నెలాఖరుకి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. నెలాఖరు తర్వాత త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా రచనలో బిజీగా ఉంటే, అల్లు అర్జున్ సుకుమార్ ప్రాజెక్ట్, వేణు శ్రీరామ్ తో చేయాల్సిన ఐకాన్ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.