మహేష్ సినిమాలో శిల్పా శెట్టి.. పాత్ర కూడా అదే

మహేష్ సినిమాలో శిల్పా శెట్టి.. పాత్ర కూడా అదే
మహేష్ సినిమాలో శిల్పా శెట్టి.. పాత్ర కూడా అదే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రానికి కమిటై ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మళ్ళీ షూటింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మహేష్ బాబు, తన తర్వాతి చిత్రాన్ని కూడా కమిటయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు పనిచేయనున్నాడు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతీ సినిమాలో సీనియర్ హీరోయిన్ చేత నటింపజేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. నదియా, ఖుష్భూ, దేవయాని, టబు వంటి వారు త్రివిక్రమ్ గత సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.

మహేష్ తో సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఒక సీనియర్ హీరోయిన్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలతో ఫేమ్ సాధించి తెలుగులోనూ చిత్రాలు చేసిన శిల్పా శెట్టిని ఒక కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ సంప్రదించాడట. మహేష్ కు పిన్ని పాత్రను ఆమె పోషించనుందని తెలుస్తోంది. మరి ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.