కోబలి ఆగిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్


trivikram-srinivas-eyes-on-kobaliదర్శకులు త్రివిక్రమ్పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ”కోబలి” అనే సినిమా తెరకెక్కాల్సి ఉండే , అంతా సిద్ధం అని అనుకునే లోపు పవన్ కళ్యాణ్ వల్ల ఆ సినిమా ఆగిపోయిందని అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తోనే ఆ సినిమా చేస్తానని 2019 ఎన్నికల తర్వాత కుదురుతుందేమో చూడాలి అని అంటున్నాడు దర్శకులు త్రివిక్రమ్ . 2014 ఎన్నికల ముందు రాయలసీమ నేపథ్యంలో ” కోబలి ” అనే చిత్రం చేయాలనీ అనుకున్నారు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ లు .

అయితే ఇక షూటింగ్ కి వెళ్లడమే తరువాయి అనుకున్న సమయంలో రాష్ట్రం విడిపోవడం , పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టడం తెలిసిందే . దాంతో కోబలి సినిమా ఆగిపోయింది , పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గా ఉండిపోయాడు ఇక ఇప్పుడేమో మళ్ళీ 2019 ఎన్నికల కోసం జనసేన ని సమాయత్తం చేస్తున్నాడు . దాంతో 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే తప్పకుండా కోబలి ఆయన తోనే చేస్తానని అంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . 2019 లో పవన్ పాత్ర ఎలా ఉంటుందో ….. కోబలి ఎప్పుడు అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి .